తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణ : ఎంపీ కవిత

SMTV Desk 2017-12-08 15:50:26  minister indrakiran reddy, telugu maha sabha, mp kavitha, nizamabad.

హైదరాబాద్, డిసెంబర్ 08 : నిర్మల్‌ జిల్లాలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యాసను గాని, భాషను గాని ప్రపంచ తెలుగు మహాసభల్లో చాటి చెప్పాలని సూచించారు. మరోవైపు నిజామాబాద్‌లో ఉద్యోగులు, భాషా ఉపాధ్యాయులు, జానపద కళాకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ కవిత సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణ. తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చింది తెలంగాణనే" అన్నారు.