ముగిసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్

SMTV Desk 2017-06-15 19:06:53  bangladesh, india

బర్మింగ్ హోమ్, జూన్ 15 : ఛాంపియన్స్ ట్రోఫిలో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బంగ్లాదేశ్ ను ఆరంభంలోనే ఎదురుదెబ్బ తీసింది. అయిన ఏమాత్రం తడబడకుండా ఓపెనర్ తమీమ్ ఇగ్బాల్ (70) ముష్బికర్ రహీమ్ (61) పరుగులతో దూకుడుగా ఆడి అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ దశలో భారీ స్కోర్ చేద్దామనుకున్న బంగ్లాదేశ్ బ్యాట్ మెన్స్ ను భారత్ బౌలర్స్ కేదార్ జాదవ్, జస్ప్రిట్ బుమ్రా కట్టడి చేసారు. దీంతో బంగ్లాదేశ్ టీం 50 ఓవర్స్ లో 7 వికెట్లకు 264 పరుగులు చేసింది. భారత్ బౌలింగ్ భువనేశ్వర్, బుమ్రా, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు తీసారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో మూడో వికెట్ కు 123 పరుగులు జోడించిన తమీమ్ ఇక్బాల్, రహీమ్ లను కేదార్ అవుట్ చేసి బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. చివర్లో భుమ్ర కట్టడిగా బౌలింగ్ చేయడం తో భారత్ విజయ లక్ష్యం 265 పరుగులు.