షాజాద్ పై ఏడాది సస్పెన్షన్...

SMTV Desk 2017-12-08 15:48:49  Mohammed Shahazd, Dope test, icc,

దుబాయి, డిసెంబర్ 8: తాజాగా ఆఫ్గానిస్థాన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్ మెన్ మహమ్మద్ షాజాద్ పై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. షాజాద్ డోప్ పరీక్షలో విఫలమవ్వడం, తనకు తెలియకుండానే హైడ్రోక్సికట్‌ అనే ఉత్ప్రేరకాన్ని బరువు తగ్గేందుకు తీసుకోవడం కారణంగా పరిగణించి ఐసీసీ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 17న డోపింగ్‌ టెస్టుకు తన మూత్రం శాంపిల్‌ ఇచ్చినప్పుడు అతడు నిషేధిత ఉత్ప్రేరక క్లెన్‌బుటెరాల్‌ సేవించినట్టు వెల్లడైందని నిబంధనల ప్రకారం నిషేధం విధించినట్టు పేర్కొంది. షాజాద్‌ 58 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లలో అఫ్ఘానిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ నిషేధం 2018 జనవరి 17తో ముగియనుంది. ఆ తరువాత యధావిధిగా క్రికెట్‌ ఆడుతాడని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డైస్ తెలిపారు.