అథ్లెటిక్స్‌ ఛాంపియన్స్ శ్రీకాంత్‌, దుర్గ...

SMTV Desk 2017-12-08 15:03:16  Athletics Championship, Telangana State Sports School, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 8: అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్ధులు తమ సత్తాను చాటారు. గచ్చిబౌలి స్డేడియం వేదికగా గురువారం జరిగిన సీనియర్‌ బాలుర విభాగంలో 800 మీటర్ల పరుగులో డి.శ్రీకాంత్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) ఛాంపియన్‌గా నిలిచాడు. అతను లక్ష్య దూరాన్ని 2 నిమిషాల 18 సెకన్లలో పూర్తి చేశాడు. 4/400మీ. రిలేలోనూ శ్రీకాంత్‌ సభ్యునిగా ఉన్న టీఎస్‌ఎస్‌ఎస్‌ బృందం విజేతగా నిలిచింది. సీనియర్‌ బాలికల లాంగ్‌జంప్‌లో వి. దుర్గ (టీఎస్‌ఎస్‌ఎస్‌) 4.31మీ. దూరం జంప్‌ చేసి టైటిల్‌ను గెలుపచుకోగా, శ్రీకీర్తి (భారతీయ విద్యాభవన్‌), కసక్‌ విజయవర్గీ (సెయింట్‌ జోసెఫ్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను కైవస౦ చేసుకున్నారు.