గుజరాత్ లో అధికారం మళ్లి బీజేపీదే: టైమ్స్ నౌ సర్వే

SMTV Desk 2017-12-08 14:34:36  times now-vmr, survey, openion pol, gujarat, elections

న్యూ డిల్లీ, డిసెంబర్ 08: గత 22 సంవత్సరాలుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీకే మళ్లీ ప్రజలు పట్టం కట్టనున్నారని టైమ్స్ నౌ-వీఎ౦ఆర్ ఒపీనియన్ పోల్ తెలిపింది. గుజరాత్ లో అధికార బీజేపీకి 106-116 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ 63-73 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఈ పోల్ తెలిపింది. రాష్ట్రంలో అధికారం దక్కాలంటే 91 సీట్ల మేజిక్ ఫిగర్ దాటాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణలు ఆ పార్టీని గట్టెక్కి౦చలేవని రాజకీయ విశ్లేషకుల భావన. హోరాహోరీగా సాగిన గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ సారి గుజరాత్ లో అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేయగా, 150 స్థానాల్లో గెలుస్తామని బీజేపీ విశ్వాసంతో ఉంది.