ఫాతిమా కళాశాల విద్యార్ధులతో... పవన్‌కల్యాణ్‌

SMTV Desk 2017-12-08 13:18:11  vijayawada, pavankalyan, fathima students, meeting

విజయవాడ, డిసెంబర్ 08 : నేడు విజయవాడలో ఫాతిమా కళాశాల విద్యార్ధులతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులు తమ సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లి, మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్న సమయంలో తమ ప్రవేశాలను రద్దు చేశారని తెలిపారు. కళాశాల యాజమాన్యం మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ పంపిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఇంకా దీనిపై మంత్రి కామినేని సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ.. విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించేందుకైనా వెనుకడానని ప్రకటించారు. యువత భవిష్యత్‌ నాశనమవుతుంటే కూర్చూ ఉరుకోనని అన్నారు. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక దేశపు సంపద ఖనిజాలు , నదులు, అరణ్యాలు కాదు.. కళల ఖనిజాలతో చేసిన యువత అని, అలాంటి యువతకు న్యాయం చేసే దాక పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.