గుజరాత్ లో ఎన్నికల వేళాయే...

SMTV Desk 2017-12-08 13:11:22  elections, gujarath, first phase, saturday

గాంధీనగర్, డిసెంబర్ 08: రెండు విడతల్లో జరగనున్న 14 వ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ ప్రచారం గురువారంతో ముగిసింది. 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో 89 నియోజకవర్గాల్లో శనివారం తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలను మొహరించామని ప్రజలు సహకరించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల సంఘం సూచించి౦ది. కాగా ఈ విడతలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గత 32 స౦.రాలుగా బీజేపీ కంచుకోటైన పశ్చిమ రాజ్ కోట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మలి దశ గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన 107 నియోజకవర్గాల్లో జరగనున్నాయి.