యునెస్కో గుర్తింపు సాధించిన "కుంభమేళా"

SMTV Desk 2017-12-08 12:37:13  kumbh mela, UNESCO recognition,

న్యూఢిల్లీ, డిసెంబర్ 08 : ప్రపంచంలో భారీగా భక్తులు హాజరయ్యే వేడుక "కుంభమేళా"కు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంస్కృతిక వారసత్వ సంపదల జాబితాలో కుంభమేళాను చేర్చింది. ఈ వేడుకల సందర్భంగా కోట్లాది హిందువులు నది వద్దకు చేరుకొని ఘనంగా జరుపుకుంటారు. భారీ మొత్తంలో కుంభమేళాకు మాత్రమే ఇంతటి ఆదరణ లభించడం విశేషం. ఇందు నిమిత్తం కుంభమేళాను యునెస్కో గుర్తింపు వరించింది. కాగా ఇప్పటి వరకు బోట్స్‌వానా, కొలంబియా, వెనెజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యూఏఈలో జరిగే వేడుకలు మాత్రమే యునెస్కో గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి.