శత్రువుల స్థావరాలను కనిపెట్టే యంత్రం

SMTV Desk 2017-12-08 12:14:32  Arbitrator 3, police, Drone

అమరావతి, డిసెంబర్ 08 : ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సహకరించేందుకు మరో పాశుపతాస్త్రం చేరనుంది. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు ఆర్బిటర్‌ 3 అనే మానవ రహిత విహంగ వ్యవస్థ కొనుగోలుకు హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న డ్రోన్‌ అనే సాంకేతికతతో పోలిస్తే అనేక రెట్లు ప్రయోజనకరమైనది. నిర్దేశిత ప్రాంతం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల కదలికలు, వారి స్థావరాల వివరాలను దీని ద్వారా అత్యంత సులువుగా కనిపెట్టవచ్చును. ఇందుకు తగ్గట్టుగా పోలీసు సిబ్బంది తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో దీన్ని తీసుకురానున్నారు.