బీ-ఫాంపై ఉన్న వేలిముద్రలు జయలలితవే..

SMTV Desk 2017-12-08 12:11:59  jayalalitha finger prints issue, b form, DMK candidate Dr Saravanan.

న్యూఢిల్లీ, డిసెంబర్ 08 : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జరుపుతున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల బీ-ఫాంపై ఉన్న వేలిముద్రలు జయలలితవేనా? అనే విషయంపై డీఎంకే అభ్యర్థి డాక్టర్‌ శరవణన్‌ విచారణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జయ చికిత్సలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందంలో డాక్టర్‌ బాలాజీ, మధుమేహ వైద్య నిపుణుడు డాక్టర్‌ ధర్మరాజ్‌ విచారణ సంఘం ఎదుట హాజరయ్యారు. ఆ వేలిముద్రలు జయలలితవేనని ప్రభుత్వ వైద్యుడు బాలాజీ సాక్ష్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీ-ఫాంలపై జయ వేలిముద్రలను వేయించడానికి నేను సాక్షిగా వెళ్లాను. ఆ సమయంలో అక్కడ శశికళ మాత్రమే ఉన్నారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడే వేలిముద్రలు తీసుకున్నా౦" అంటూ పేర్కొన్నారు. కాగా మరోసారి ఈ నెల 27న బాలాజీని విచారణకు ఆదేశించారు.