ఎపి సీఎ౦ కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్...

SMTV Desk 2017-12-08 11:25:05  chandrababu, assets, lokesh, announce, amaravathi updates

అమరావతి, డిసెంబర్ 08: వరుసగా ఏడోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ప్రకటించారు. వీటిని తన తనయుడు, మంత్రి నారా లోకేష్ వెల్లడిస్తూ, దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని గర్వంగా చెప్పారు. ఈ ఆస్తుల విలువ మార్కెట్ ధరల ప్రకారం కాదని, కొనుగోలు ధరలు ప్రకటిస్తున్నానని లోకేష్ తెలిపారు. మా కుటుంబం పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తు౦దని, మాపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సరికావని ఆయన అన్నారు. వైకాపా అధినేత జగన్‌ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని ఆయన విమర్శించారు. కాగా లోకేష్ ప్రకటించిన ఆస్తులు మార్కెట్ ధరల ప్రకారం అనేక రెట్లు ఎక్కువ ఉంటుందని విపక్షాలు ఆరోపించాయి. లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు: చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు లోకేష్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు