జోరందుకున్న మార్కెట్లు..

SMTV Desk 2017-12-07 17:58:09  Sensex, Nifty, Share Rates, Business news

ముంబాయి, డిసెంబర్ 7: రెండు రోజుల పాటు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల సెంచరీ వైపు అడుగులు వేసింది. 80 పాయింట్ల లాభంతో ఆరంభమైన సూచీ, మార్కెట్‌ ముగిసే సమయానికి 352 పాయింట్లు ఎగబాకి 32,949 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టి 123 పాయింట్ల లాభంతో 10,167 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.59గా కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటోమొబైల్‌ సహా దాదాపు అన్ని రంగాల్లో పెట్టుబడి దారులు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. అంతే కాదు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో బాగంగా గెయిల్‌ షేర్లలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ భారీ స్థాయిలో లాభపడింది. ఒక్కో షేరు ధర 8శాతానికి పైగా పెరిగింది.