జామా మ‌సీదు హిందూ దేవాల‌య‌౦ : ఎంపీ ఖ‌తియార్

SMTV Desk 2017-12-07 16:51:45  BJP MP Vinay Katiyar, comments on jama masjid, Congress leader Raj Babbar.

న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : ఢిల్లీలోని జామా మ‌సీదు ఒకప్పుడు హిందూ దేవాల‌య‌మేన‌ని బీజేపీ ఎంపీ విన‌య్ ఖ‌తియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన జామా మసీదు గురించి ప్రస్తావిస్తూ.. "జామా మ‌సీదు ఒక‌ప్ప‌టి జ‌మున దేవి ఆల‌య‌౦. కాని ఆ ఆలయాన్ని మొఘ‌లులు నాశ‌నం చేసి ఆ స్థానంలో జామా మ‌సీదు క‌ట్టారు" అని ఆరోపించారు. గతంలో కూడా ఖ‌తియార్ తాజ్ మ‌హ‌ల్ ఓ శివాల‌య‌మ౦టూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా విన‌య్ ఖ‌తియార్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నాయ‌కుడు రాజ్ బ‌బ్బ‌ర్ స్పందిస్తూ.. ప్ర‌జ‌ల దృష్టిని త‌మ‌ వైపుకు తిప్పుకోవ‌డానికి ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని విమర్శలు గుప్పించారు.