పాక్ ప్రధాని షరీఫ్ ను నిలదీసిన సౌదీ రాజు

SMTV Desk 2017-06-15 18:14:00  Pakistan President Navaz Shareef,Soudi Arebiya King salman,Khatar,

ఇస్లామాబాద్, జూన్ 15 : మీరు ఎవరి పక్షం వైపు ఉంటారో చెప్పాలని పాక్ ప్రధాని షరీఫ్ ను సౌదీ అరేబియా రాజు సల్మాన్ నిలదీశారు. ఖతార్ తో దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో తలెత్తిన సంక్షోభ నివారణ కోసం నవాజ్ షరీఫ్ సోమవారం జెడ్డాకు వెళ్లి ఆ దేశ రాజుతో సమావేశం అయ్యారని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. అరబ్ దేశాల్లో నెలకొన్న దౌత్య సంక్షోభ విషయంలో తాము ఎవరి పక్షమూ వహించబోమని నవాజ్ షరీఫ్ చెప్పారు. కానీ మీరు మాతో ఉన్నారా? ఖతార్‌తో ఉన్నారా? అన్న విషయం స్పష్టం చేయాలని పాకిస్థాన్‌ను సౌదీ రాజు సల్మాన్ నిలదీశారని ఈ పత్రిక పేర్కొంది. పాకిస్థాన్ మాత్రం ఖతార్‌కు, ఇతర అరబ్ దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంక్షోభం పరిష్కారం విషయమై ఆచితూచి ముందుకు వెళ్లాలని భావిస్తున్నది.