ఇన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ నె౦.2 "కోహ్లీ"...

SMTV Desk 2017-12-07 14:42:44  virat kohli, test rankings, stevamith,

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: టీంమిండియా క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ, రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫిరోజ్ షా కోట్లా టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లోనే ద్విశతకంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధి౦చి ఏకంగా మూడు స్థానాలు ఎగబాకాడు. అంతకు ముందు రెండో స్థానంలో ఉన్న భారత్ ఆటగాడు పుజారా, నాలుగో స్థానానికి చేరాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో ఉండగా, కోహ్లీ 893 పాయింట్లతో రెండవ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రథమ స్థానం తను సాధించడానికి కోహ్లీ ఇంకో అర్ధశతకం రాణిస్తే సొంతమవుతుంది.