వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా: పుతిన్

SMTV Desk 2017-12-07 14:30:13  putin, russia, elections, president

మాస్కో, డిసెంబర్ 07: 2000 సంవత్సరం నుంచి ఏదో విధంగా అధికారాన్ని తన చేతిలోనే ఉంచుకు౦టున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రష్యా అధ్యక్షుడిగా, ప్రధానిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల్లో ఒకవేళ పుతిన్ గెలిస్తే, 2024 వరకు మళ్లీ ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయంగా వెలివేశారు. పుతిన్ పై ఎవరు పోటీచేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. మల్లీ గెలిస్తే రష్యాను అత్యధిక కాలం ఏలిన నేత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రెండవ స్థానంలో పుతిన్ నిలుస్తారు.