పెద్దాపురం రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం

SMTV Desk 2017-12-07 13:49:50  fire accident, peddapuram, rice mill, east godavari

పెద్దాపురం, డిసెంబర్ 07 : జిల్లాకు చెందిన పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం రోడ్డులో ఉన్న, శ్రీ లలిత రైస్‌ మిల్లులో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరగిందని సంస్థ యాజమాన్యం, కార్మికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న 8 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అగ్ని కీలలు భారీగా ఎగిసి పడడంతో నియంత్రణ చేయడం సిబ్బంది వల్ల కాలేదు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 4 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. రైస్‌ మిల్లు అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పర్యవేక్షించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.