వావ్.. 40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది..

SMTV Desk 2017-12-07 12:53:14  huawei, 40 MP triple-lens camera mode, Photography-centric smartphone,

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువాయ్‌ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లను మార్కెట్లోకి తీసుకొస్తూ వినియోగదారులను ఉత్సాహపరుస్తూ౦టుంది. ఇటీవల ఈ కంపెనీ ఫోటోగ్రఫీ-సెంట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తపై ఇవాన్‌ బ్లాస్‌ ట్విట్ చేశారు. హువాయ్‌ కొత్తగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు 40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా మోడ్యుల్‌, సెల్ఫీ కెమెరా 24 మెగాపిక్సెల్‌ లతో రూపొందుతుందనిఅంతేకాదుజర్మన్‌ కెమెరా కంపెనీ లైకా కో-డెవలప్డ్‌గా సహకారం అందిస్తుందని తెలిపారు. లైకాతో హువాయ్‌ గత కొన్నేళ్లుగా భాగస్వామ్యం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.