నేడు 29వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం...

SMTV Desk 2017-12-07 11:47:39  praja sankalpa yatra, jagan, ysrcp, anantapoor updates

అనంతపురం, డిసెంబర్ 07: అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం 29వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు శింగనమల నియోజకవర్గం కల్లుమడి నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్రలో భాగంగా, కల్లుమడిలో జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 10.30 గంటలకు గమ్మేపల్లి చేరుకున్న ఆయన అక్కడ పార్టీ జెండాతో పాటు వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం 12.00 గంటలకు భోజన విరామం తీసుకున్న అనంతరం తిరిగి 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. నేటి పాదయాత్ర కల్లుమడి మీదుగా గుమ్మేపల్లి వరకు కొనసాగనుంది.