డెబిట్‌కార్డు వినియోగదారులకు శుభవార్త...

SMTV Desk 2017-12-07 11:39:57  rbi, debit card, digital payemnts,

ముంబాయి, డిసెంబర్ 7: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు డిజిటల్ లావాదేవిలపై మొగ్గుచూపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అందులో ముఖ్యంగా డెబిట్‌ కార్డుల వాడకం ఎక్కువగా ఉన్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు, డెవలప్‌మెంట్‌, రెగ్యులేటరీ పాలసీలపై నిర్ణయాలు తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. డెబిట్‌ కార్డు పేమెంట్స్‌కు మరింత ప్రోత్సాహం అందిచేందుకు అదనపు ఛార్జీల భారం సడలించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ పేర్కొంది.