సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖైదీ విడుదల

SMTV Desk 2017-06-15 17:05:28  Wifes sister, In jail for 16 years,Supreme Court orders, Gadchiroli in Maharashtr,Madanayya

న్యూఢిల్లీ, జూన్ 15 : భార్య సోదరిని చంపిన కేసులో 16 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న వ్యక్తిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం విడుదల చేశారు. ఆమెను చంపాలనే ఉద్దేశం అతనికి లేదని తేల్చింది. మహారాష్ర్టలోని గడ్చిరోలికి చెందిన మదనయ్య తన భార్య సోదరికి భర్త పోవడంతో తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఆమెతో సాన్నిహిత్యం పెరుగడంతో రెండో భార్యగా స్వీకరించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. అందుకు ఆమే కారణమని మదనయ్య రోజు వేధించేవాడని, ఒకరోజు ఆవేశంలో ఆమెను కొట్టగా, ఆ తర్వాత సుమారు రెండు గంటలకు ఆమె భోజనం చేసి కడుపులో నొప్పిగా ఉందంటూ అక్కడికక్కడే కన్నుమూసింది. దాంతో మదనయ్యనే తన రెండో భార్యని వేధిస్తూ చంపేశాడని, ఈ కేసులో అతనికి గడ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించారు. అనంతరం ముంబై హైకోర్టు ఆ శిక్షను ధృవీకరించడంతో సుప్రీంకోర్టు అతనికి హత్య చేసే ఉద్దేశమే లేదని నిర్ధారించింది. ఒకవేళ అనుకోకుండా అవతలి వ్యక్తి మృతికి కారణమైతే పడే శిక్ష పదేండ్లు. ఆ రకంగా చూసినా అంతకుమించి మదనయ్య జైలులో గడిపినందున వెంటనే అతడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.