దొంగలించిన కారులో పెట్రోల్ కోసం.. అడుకున్న వైనం

SMTV Desk 2017-12-06 19:36:19   Stolen car, Santa Ana in America, police

వాషింగ్టన్, డిసెంబర్ 06 ‌: అమెరికాలోని శాంటా ఆనాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం ఎడ్వర్డ్‌ యార్క్‌ అనే వ్యక్తి కారును సర్వీసింగ్‌కు ఇచ్చి, అనంతరం తెచ్చుకునేందుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది కారు చోరీ అయినట్లు చెప్పారు. దీంతో ఆయన సమీపంలోని పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పుతూ, ఫిర్యాదు చేశారు. కాగా, రెండు వారాల తరువాత ఓ వ్యక్తి ‌ పెట్రోల్‌కు డబ్బులు కావాలంటూ అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని గమనించిన పోలీసులు అనుమానం వచ్చి అతడిని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇజ్రాయెల్‌కు చెందిన పెరెజ్‌ రంగేల్‌ గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఈజీమనీకి అలవాటుపడ్డ పెరెజ్‌ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా గతవారం ఖరీదైన ఫెరారీ కారును దొంగలించాడు. చోరీకి గురైన ఆ కారు విలువ 3లక్షల డాలర్లు(దాదాపు రూ.2కోట్లు) ఉంటుందట.