పోలవరం పై సరైన వాస్తవాలు చెప్పాలి :ఎమ్మెల్సీ సోము వీర్రాజు

SMTV Desk 2017-12-06 17:45:27  polavaram project, BJP, MLC Somma Veerraju, amaravathi

అమరావతి, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ పై చెడు ప్రచారాలు చేయడం న్యాయం కాదంటూ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలవరం పై సరైన వాస్తవాలను బయటకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాగా, సాంకేతిక లోపాల వల్లే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయడం జరిగిందని, ఎన్ని సమస్యలు ఎదురైన ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన వెల్లడించారు.