మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి :ఆర్జేడీ, జిల్లా ఇన్‌ఛార్జి

SMTV Desk 2017-12-06 17:08:35  RJD, District In charge Deo D Devananda Reddy, nujividu, krishna dist

నూజివీడు, డిసెంబర్ 06 : నూజివీడు డీవైఈవో కార్యాలయంలో ఆర్జేడీ, జిల్లా ఇన్‌ఛార్జి డీఈవో డి.దేవానందరెడ్డి ఈ నెల 5 న డివిజనులోని ఎంఈవోలు, సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులతో చిట్టి చేతులు చక్కని రాతలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... చిట్టి చేతులు చక్కనిరాతలు కార్యక్రమం విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల త్రిశూల వ్యూహాంపైన సమీక్షించారు. ఆయా తరగతి సబ్జెక్టులకు సంబంధించిన పలు అంశాలను ఉపాధ్యాయులకు వివరించారు. విద్యలో నూరుశాతం ఫలితాలు సాధించడంతో పాటు 10/10 గ్రేడులు సాధించేలా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే, మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డీవైఈవో రవిసాగర్‌ తదితరులు హజరయ్యారు.