అలరిస్తున్న పవన్ ఫొటోస్...

SMTV Desk 2017-12-06 16:54:14  janasena, pawan kalyan, death anniversary, twitter, ambekar, periyar stills

హైదరాబాద్, డిసెంబర్ 06 : ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సృష్టికర్త, అణగారిన వర్గాల పెన్నిధి, డా. బీఆర్‌.అంబ్కేదర్‌ వర్ధంతి సందర్భంగా తన సామాజిక మాధ్యమ౦ ద్వారా నివాళులు తెలిపారు. అంతే కాకుండా తనకు నచ్చిన నాయకుల ఫోటోలు అంటూ బీఆర్‌.అంబ్కేదర్‌, పెరియార్ కలిసి ఉన్న చిత్రాన్ని జత చేశారు. ఈ సందర్భంగా పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ " గొప్ప నాయకుడు అంబేద్కర్ కు సెల్యూట్‌. జై భీం.. నాకు బాగా నచ్చిన పోరాట యోధులలో ఒకరు అంబేద్కర్ కాగా, మరొకరు పెరియార్. వీరిద్దరూ వారి తుది శ్వాస వరకు సామాజిక న్యాయం, అసమానతలపై పోరాడారు. ఈ ఫొటోని నేను లండన్‌లోని అంబేడ్కర్‌ హౌస్‌కి వెళ్లినప్పుడు తీశాను" అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పవన్ వారి ఫోటోను తదేకంగా చూస్తున్న స్టిల్ అభిమానులను అలరిస్తుంది.