త్వరలో 24 మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా

SMTV Desk 2017-06-15 16:28:58  24 municipality, Supply of drinking water,Raghava Constructions, 164.48 crores,1,521.34 crore,60.76crore

హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణ రాష్ట్రంలో తాగునీరుకి ఎలాంటి అంతరాయం కలుగకుండా అందరికి అందేలా మొత్తం 24 మున్సిపాలిటీలకు తాగునీటిని సరఫరా చేయడానికి ప్రజారోగ్యం ఇంజినీర్ ఇన్ చీఫ్ టెండర్లను ఆహ్వానించగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్, జీవీపీఎర్ ఇంజినీర్స్ రూ.164.48 కోట్లకు యూన్యుటీ విధానంలో పనులను దక్కించుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 35 పట్టణాల్లో తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా అందులో పది పట్టణాలకు అమృత్ పథకంలో రూ.1,521.34 కోట్ల పనులకు రాష్ట్రప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చారు. మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ.60.76 కోట్ల అంచనా విలువతో మంచినీటి పనులకు పురపాలకశాఖ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో మంచినీటి పనులు చేపట్టనున్నారు.