విశాఖలో నేటి నుంచి పలు రైళ్లు రద్దు

SMTV Desk 2017-12-06 14:33:22  vishakha railway station, DCM Coordination G. Sunil Kumar

విశాఖపట్నం, డిసెంబర్ 06: విశాఖలో బుధవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ డీసీఎం కో-ఆర్డినేషన్‌ జి.సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌ సమీపంలోని సింహాచలం నార్త్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆధునికీకరణ (నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌) పనులు చేపడుతున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.