గుజరాత్ లో సమఉజ్జీలుగా కాంగ్రెస్..బీజేపీ..!

SMTV Desk 2017-12-06 13:03:10  gujarat, elections, bjp, congress, modi, rahul

గాంధీనగర్, డిసెంబర్ 06: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకుంది. గత 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగా ఉన్న వ్యతిరేకతతో పాటు జీఎస్టీ తో వ్యాపార ప్రధాన రాష్ట్రమైన గుజరాత్ లో సూక్ష్మ, మధ్యస్థ వ్యాపారులు వ్యతిరేకతతో ఉన్నారు. రాహుల్ కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షుడిగా ఉత్సాహంతో గుజరాత్ లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మోడీ ప్రధానిగా గుజరాత్ ను వీడడం, పటేళ్ళు కాంగ్రెస్ కు మద్దతివ్వడం, గోరక్ష పేరుతో దళితులపై దాడులు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు కాగా, బలమైన రాజకీయ పునాది, మోదీ-షా రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ నిలవలేదని విశ్లేషకుల భావన. కాగా 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 91-99 సీట్లు, కాంగ్రెస్ కు 78-86 మధ్య సీట్లు గెలిచే అవకాశం ఉందని లోక్ నీతి-సీఎస్డీఎస్-ఏబీపీ తాజా సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కి సమానంగా 43శాతం ఓట్లు రావచ్చని ఈ ఉమ్మడి సర్వే తెలిపింది. కాగా నాలుగు నెలలక్రితం ఇదే సర్వే బీజేపీకి 150 సీట్లు వస్తాయని తెలిపింది. నాలుగు నెలల్లో బీజేపీ ఓటింగ్ షేరు 16శతం మేర పడిపోయి, కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. డిసెంబర్ 18న వెలువడనున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అధికారాన్నిస్తాయో వేచి చూడాల్సిందే.