మహీంద్రా ఎక్స్‌యూవీ సరికొత్త మోడల్...

SMTV Desk 2017-12-06 12:58:15  mahendra xuv 500, mahendra sports car, new delhi,

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అధునాతన మోడల్‌ ను మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ స్పోర్ట్స్‌ వినియోగ వాహనాన్ని విపణిలోకి ప్రవేశపెట్టింది. స్టాటిక్‌ బెండింగ్‌ హెడ్‌లైట్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌ వంటి ఫీచర్లు కలిగిన ఎక్స్‌యూవీ 500లో పెట్రోల్‌ వేరియంట్‌ను పరిచయం చేసింది. దీని ధర రూ.15.49 లక్షలుగా కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్‌ ప్రత్యేకత ఏంటంటే... జపాన్‌కు చెందిన ఏఐఎస్‌ఐఎన్‌ నుంచి తీసుకున్న 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌,2.2 లీటర్‌ ఎంహాక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, గరిష్ఠంగా 140హెచ్‌పీ శక్తిని అందించే సామర్ధ్యం, కలిగి ఉండటం.