ఆదుకొని రూట్.. పరాజయపాలైన ఇంగ్లాండ్‌..

SMTV Desk 2017-12-06 12:17:01  england, asis series, test match,

అడిలైడ్, డిసెంబర్ 6: ఆసీస్-ఇంగ్లాడ్ ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, రెండో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరో పరాజయాన్ని చవిచూసింది. 120 పరుగుల తేడాతో కంగారులు ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు. మిచెల్‌ స్టార్క్‌ (5/88) బౌలింగ్‌ దాడికి బ్రిటిష్ బ్యాట్స్‌మెన్స్ అల్లాడారు. ఐదు మ్యాచుల సిరీస్‌లో స్మిత్ సేన ఆధిపత్యం చెలాయించి౦ది. ఐదోరోజు, బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 176/4తో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఒక పరుగుకే సారథి జోరూట్‌ వికెట్ కోల్పోయాడు. అక్కడి నుండి వికెట్ల పతనం మొదలై, వరుసగా క్రెయిగ్‌ ఓవర్టన్‌ (7), స్టువర్ట్‌ బ్రాడ్‌ (8), జానీ బెయిర్‌స్టో (36)ను స్టార్క్‌ పెవిలియన్‌ కు చేర్చాడు. దీంతో 84.2 ఓవర్లకు పరుగులతో ఇంగ్లాండ్ ఆట ఆగిపోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌: 442/8 డిక్లేర్డ్‌ , రెండో ఇన్నింగ్స్‌ 138 ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 227, రెండో ఇన్నింగ్స్‌ 233