యువత.. అధైర్య పడవద్దు : ఎంపీ వినోద్

SMTV Desk 2017-12-06 12:15:08  unemploye question to MP vinod, for jobs issue.

కరీంనగర్‌, డిసెంబరు 6 : మూడేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశార౦టూ ఓ నిరుద్యోగ యువకుడు ఎంపీ వినోద్‌ను ప్రశ్నించాడు. ఇటీవల కరీంనగర్ వెళ్ళిన ఎంపీని యోగి అనే యువకుడు ఉద్యోగాల భర్తీపై పై విధంగా ప్రశ్నించగా.. దానికి స్పందించిన ఆయన టీఎస్‌పీఎస్సీ ద్వారా రానున్న రోజుల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయని బదులిచ్చారు. అలాగే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యపడవని తెలిపారు. నిరుత్సాహ పడకుండా తగిన శిక్షణ తీసుకోవాలని యువతకు సూచించారు.