పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

SMTV Desk 2017-12-06 12:13:34  polavaram project, central government, nithin gadkari

అమరావతి, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పోలవరం పై నెలకొన్న అనుమానాలు, అపోహలు పటాపంచలు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ నిర్మాణానికి పూర్తి భరోసా ప్రకటిస్తూ అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని గుత్తేదార్లకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు సందర్శించి పనులు సమీక్షిస్తానని జలవనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు పై పూర్తి దృష్టి పెట్టింది. కాగా, ఈ నెల 22న పోలవరం ప్రాజెక్టును గడ్కరీ సందర్శించనున్నారు.