ఈ ఒలంపిక్ పతక విజేత ఫోటో చూశారా..!

SMTV Desk 2017-12-06 11:42:14  pv sindhu, kidambi srikanth, pullela gopichand,

హైదరాబాద్, డిసెంబర్ 6: తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది భారత్ ఒలంపిక్ పతక విజేత పి.వి. సింధు. తాజాగా ఆమె తన ట్విట్టర్ వేదికగా... తాను 8ఏళ్ల వయసులో బ్యాడ్మింటన్‌ ఆడటం ప్రారంభించి రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని అందుకున్నట్లు, ఇప్పటివరకు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింద౦టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగించే ఫోటో ఒకటి, దానితో పాటు బ్యాడ్మింటన్‌ గురించి పంచుకోవాలని కిదాంబి శ్రీకాంత్‌ను కోరింది. సింధు కోరిక మేరకు కిదాంబి శ్రీకాంత్‌ కూడా తన జీవిత ప్రయాణంలోని ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ... "నేను 16 ఏళ్ల వయసులో అకాడమీలో చేరాను. నా చిన్నతనంలో గోపీచంద్‌ సార్‌ నుంచి అవార్డు అందుకున్న తరుణం ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ ట్విట్ చేశారు.