కోహ్లీ రికార్డుల మోత మోగించాడు...

SMTV Desk 2017-12-06 11:10:18  virat kohli, test match, team india,

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ సారధి కోహ్లీ తాజాగా ఓ అద్భుతమైన రికార్డును సాధించాడు. ప్రస్తుతం భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో 36 ఏళ్ల రికార్డును కోహ్లీ చిత్తు చేశాడు. ఈ టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 293 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. దీంతో మొదటి స్థానంలో ఉన్న సునీల్‌ గావస్కర్‌ (289) రెండో స్థానానికి పడిపోయాడు. అంతేకాదు మరో ఘనత కూడా కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ద్విశతకంతో పాటు అర్ధశతకం నమోదు చేసిన ఏడో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.