కరీంనగర్ లో పర్యటించనున్న కేసీఆర్...

SMTV Desk 2017-12-06 11:02:31  CM KCR, karimnagar tour, kaleshwaram project aerial survey.

హైదరాబాద్, డిసెంబర్ 06 : ముఖ్యమ౦త్రి కేసీఆర్ నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నేటి సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ఏరియల్ సర్వే చేయనున్న ఆయన.. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2018 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీటిని అందిస్తామని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం ఇదే తొలిసారి. కరీంనగర్ పర్యటన అనంతరం అక్కడి నుండి రామగుండం వెళ్లనున్నారు.