కొత్త ఫీచర్స్ తో మరో రెండు ఫోన్లు

SMTV Desk 2017-06-15 15:38:37  India,Samsung J series phones,Samsung pay services, President Asimvarsee

న్యూఢిల్లీ, జూన్ 15 : భారత్ లో గత కొద్ది నెలలుగా నష్టాలను ఎదుర్కొంటున్న ప్రసిద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ వాటిని పూడ్చుకునేందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది. దీనిలో భాగంగా జాతీయ మార్కెట్ లోకి మరో రెండు ఫీచర్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో జే 7 మాక్స్ ధర17,900 రూలు జే 7 ప్రో ధర 20,900 రూ.లుగా ఉన్నాయి. ఈ పాటికే జే సీరీస్ లో భాగంగా జే2, జే5 ,జే 7 వంటివి ఉండడంతో వీటి సంఖ్య తాజాగా పదికి పైగా చేరుకున్నాయి. జే 7 మాక్స్ లో 5.7 అంగుళాల తెర, 1.6 గిగాహేడ్జ్ ఆక్తాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ(256 జీబీ పెంచుకోవచ్చు) ముందు, వెనుక 13 మెగా పిక్సెల్ కెమెరాలు , 3,300 ఎంఏ హెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్ లలో ఈ మొబైల్ లభ్యమవుతుంది. వచ్చే నెలలో లభించనున్న జే 7 ప్రోలో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ (128 జీబీ వరకు పెంచుకోవచ్చు), 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్ ఉన్నాయి. మూడు నెలల క్రితం ప్రారంభించిన సామ్ సంగ్ పేలో ఎస్ 8, ఎస్ 7 ఎడ్జ్, ఎస్ 6 ఎడ్జ్ ప్లస్ మోడళ్ళు లభిస్తున్నాయి. సామ్ సంగ్ పే సేవలకు వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన వచ్చిందని, వచ్చే కొన్ని వారాల్లో సామ్ సంగ్ మినీ సేవలను కూడా ప్రారంభిస్తామని కంపెనీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ తెలిపారు.