గడువు సమీపిస్తోంది.. ఆధార్ లింక్ చేయండి...

SMTV Desk 2017-12-05 18:31:35  adhar card Link, central government, dead line, six services.

న్యూఢిల్లీ, డిసెంబర్ 05 : వివిధ సేవలను కొనసాగించాలంటే తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలంటూ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరు సేవలకు కేంద్ర ప్రభుత్వం విధించిన ఆధార్‌ అనుసంధానం గడువు దగ్గర పడుతోంది. వీటిలో పాన్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్‌ పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, పోస్ట్‌ ఆఫీస్‌ స్కీమ్‌లకు ఈ నెల 31 కాగా, మొబైల్‌ నంబర్లతో ఆధార్ అనుసంధానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 చివరి తేదీగా ఉంది. ఒకవేళ నిర్ణయించిన గడువు లోపు ఆధార్ అనుసంధానం చేసుకోలేక పోతే ఆ సేవలను పొందే అవకాశం ఉండద౦టూ ఇప్పటికే సందేశాత్మక రూపంలో హెచ్చరికలను జారీ చేస్తున్నారు.