విశాల్ కు షాక్.. నామినేషన్ తిరస్కరించిన ఈసి...

SMTV Desk 2017-12-05 18:26:46  vishal, rk nagar elections, deepa jaya kumar, election commission.

చెన్నై, డిసెంబర్ 05 : తమిళ రాజకీయాల్లో అనుకోని సంఘటన ఎదురైంది. ఆర్కేనగర్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన జయలలిత మేన కోడలు దీపా జయకుమార్, నటుడు విశాల్ లకు షాక్ నిస్తూ ఎన్నికల సంఘం వారి నామినేషన్ ను తిరస్కరించింది. రెండు రోజుల క్రితం దీప నామినేషన్ వేయగా, విశాల్ నిన్న నామినేషన్ వేసిన విషయం విదితమే. నామినేషన్ పత్రంలో ఆదాయానికి సంబంధించిన వివరాలను అసంపూర్తిగా నింపడం వల్ల తిరస్కరించామంటూ ఈసీ వివరణ ఇచ్చింది. అటు హీరో విశాల్ కు తమిళ సినీ ఇండస్ట్రీ నుండి ఒత్తిడి ఎదురైంది. తాను నిర్మాతల మండల పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మండల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.