మహారాష్ట్రలో బీజేపీ నేత యశ్వంత్‌ సిన్హా అరెస్ట్!

SMTV Desk 2017-12-05 17:41:16  yashvanth sinha, arrest, formers, agitation, maharashtra, bjp

ముంబై, డిసెంబర్ 05: మహారాష్ట్రలో అధికార బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నాయకుని నుంచే నిరశన ఎదురైంది. మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు యశ్వంత్‌ సిన్హా విదర్భ ప్రాంతంలో రైతులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా, అకోలాలో జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రైతుల నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. అనేకమంది రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా పాల్గొని రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. బొంబాయి పోలీస్‌ చట్టంలోని 68వ సెక్షన్‌ కింద ఆయనతోపాటు 250 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్లు అకోలా జిల్లా ఎస్పీ రాకేష్ కళాసాగర్ తెలిపారు. సీనియర్ అయిన తనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆది నుంచి యశ్వంత్‌ సిన్హా బీజేపీ నాయకత్వంపై అసహనంతో ఉన్నారు. కాగా వయస్సు రిత్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.