ఫేస్ బుక్ యూజర్లకు మరో సరి కొత్త యాప్...

SMTV Desk 2017-12-05 17:34:47  facebook messenger, facebook, apple mobiles, america

అమెరికా, డిసెంబర్ 5: సోషల్ మీడియాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉపయోగించే ఫేస్ బుక్ యూజర్లకు మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఈ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది ఏంటంటే ఫేస్‌బుక్‌ కొత్త మెసెంజర్‌, దీని ప్రత్యేకత ... పిల్లలు ఎవరితోనైనా స్నేహం చేయాలంటే, అవతలి వ్యక్తి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ తల్లిదండ్రులు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను సోమవారం అమెరికాలో లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ యాప్ సౌకర్యం ఆపిల్‌ ఫోన్లకు మాత్రమే వుంది. త్వరలో మన దేశంలోనూ ఈ సరి ‌కొత్త మెసెంజర్‌ ను తీసుకురానున్నారు.