ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు జపాన్ సన్నాహాలు

SMTV Desk 2017-12-05 16:50:53  North Korea, japan, Hvasang 15 Using a missile

టోక్యో, డిసెంబర్ 05 : నేడు ఉత్తరకొరియా తాజాగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి జపాన్ దేశాన్ని కూడా కన్నెర్ర చేసేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా హ్వాసంగ్‌ 15 పేరుతో ఉన్న ఈ క్షిపణిని జపాన్‌ జలాల్లో పడేసింది. దీంతో ఉత్తరకొరియాకు తగిన బుద్ధి చెప్పేందుకు జపాన్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అటు అమెరికా సహా, ప్రపంచదేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, భారీ సామర్థ్యం ఉన్న క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే జపాన్ కొంత నిధులను కూడా కేటాయించిందట. వచ్చే ఏడాది బడ్జెట్‌లో క్షిపణి కొనుగోలు కోసం నిధులు కేటాయించనున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునే క్షిపణి కోసం జపాన్‌ చూస్తున్నట్లు సమాచారం. కానీ జపాన్ రాజ్యాంగం ప్రకారం 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లే క్షిపణులను ఆ దేశం వాడకూడదు. దీనిపై అక్కడ వివాదాస్పదం నెలకొనే అవకాశముంది.