అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య...

SMTV Desk 2017-12-05 16:34:23  lecturer, harassment, student, suicide, bhadrachalam

దమ్మపేట, డిసెంబర్ 05: విద్యాబుద్దులు నేర్పవలసిన అధ్యాపకుడు వేధింపులకు పాల్పడి విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని దమ్మపేట మండలం, లింగాలపల్లి గ్రామానికి చెందిన చాపా కృష్ణప్రియాంక(19) భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆ కళాశాలకు చెందిన ఓ అధ్యాపకుడు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా, భరించలేక పోయిన ఆ విద్యార్ధిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టి, నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.