నూతన వధూవరులు మహాలక్షీ ఆలయంలో...

SMTV Desk 2017-12-05 16:01:40  zaheer khan, sagarika, mahalakshmi temple, kolhapur

కొల్హాపూర్, డిసెంబర్ 5: చూడ ముచ్చటైన జంట అంటూ నెట్టింట్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎవరా జంట అనుకుంటున్నారా..! ఇటీవల భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌, బాలీవుడ్‌ భామ సాగరికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో ఒక్కటైన జంట. తాజాగా ఈ నూతన వధూవరులు, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొలువైన మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అక్కడి అమ్మవారి ఆశీస్సులు అందుకొని బయల్దేరారు. ఈ సందర్బంగా వారు అమ్మవారిని దర్శించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో జహీర్ తెల్ల కుర్తా పైజమా ధరించి, సాగరిక సాంప్రదాయ దుస్తులతో కనిపించారు. ఇందులో ఆ జంటను అందరూ చూసి, మతాంతర వివాహమైన తమ సంప్రదాయాలకు గౌరవం ఇస్తున్నారని తెగ పొగిడేస్తున్నారు.