డిసెంబర్ 6నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ అర్హత పరీక్షలు: తెవి

SMTV Desk 2017-12-05 15:28:50  telugu university, mphil, phd, qualifying exam

హైదరాబాద్, డిసెంబర్ 05: ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు డిసెంబర్ 6 నుంచి 11 వరకు అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. దరఖాస్తు దారులు యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని వారు తెలిపారు. నాంపల్లి, వరంగల్, శ్రీశైలం, రాజమండ్రి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. విద్యార్ధులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వారు సూచించారు.