చీటి పేరుతో చీటింగ్.. 10 కోట్లు టోక్ర...

SMTV Desk 2017-12-05 15:10:09  MONEY LANDING, FRAUD FOR CHITS, HUDERABAD NEWS.

హైదరాబాద్, డిసెంబర్ 05 : చిట్టీలు వేసి డబ్బులను ఆదా చేద్దామని పలువురిని నమ్మించాడు. చివరికి రూ.10 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాణిక్ రెడ్డి హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో పని చేసే యాదగిరి రెడ్డి అనే వ్యక్తితో మాట్లాడి నెలవారీ చిట్టీలు వేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం, గుడిమల్కాపూర్ మార్కెట్లలో చిట్టీల వ్యాపారం చేస్తూ దాదాపు రూ.6.30 కోట్ల టర్నోవర్ సాధించాడు. ఈ వ్యాపారంలో లాభాలు లక్షల్లో వస్తుండడంతో మరింత సంపాదించేందుకు పక్కా ప్రణాళికలు రచించాడు. కార్లు, బంగారంతో ధనవంతుడిగా అందరిని నమ్మించాడు. ఇది చూసి అందరు అతను ధనవంతుడిగా నమ్మి అతనికి తక్కువ వడ్డీకి రూ.4 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు చెల్లించమంటే వాయిదా వేస్తూ వస్తున్నాడు. గట్టిగా అడిగితే ఐపీ పెడతానంటూ హెచ్చరించాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు.