నూగట్‌ అవుట్.. ఓరియో ఇన్..

SMTV Desk 2017-12-05 14:48:08  nokia 3, Chief Production Officer Zhuo Sarvoks

ముంబాయి, డిసెంబర్ 5: మీడియాటెక్‌ ఎంటీ 6737 ప్రాసెసర్‌తో రూపొందిన నోకియా 3 ఫోన్ పై, హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో భాగంగా నూగట్‌ 7.1.2ను కాకుండా నేరుగా ఓరియో 8.0ను అందించాలని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జుహో సర్వోక్స్‌ వెల్లడించారు. ఇటీవల ఈ సంస్థ, నూగట్‌ వెర్షన్‌తో నోకియా 3ను విడుదల చేసింది.