శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ ల రాజ్యసభ సభ్యత్వ౦ రద్దు

SMTV Desk 2017-12-05 14:37:04  Sharad Yadav, Ali Anwar Ansari, Rajya Sabha memberships Cancellation

పట్నా, డిసెంబర్ 05 : జేడీ(యూ) తిరుగుబాటు నాయకుడు శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయంపై శరద్‌యాదవ్‌ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. "ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటాన్ని కొనసాగిస్తాను. అప్రజాస్వామిక విధానాలపై మాట్లాడటం నాదే తప్పు" అంటూ అంటూ పోస్ట్ చేశారు. కాగా సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి.. శరద్‌ యాదవ్‌, అలీ అన్వర్‌ అన్సారీల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.