ఏపీ సచివాలయంలో పాము హాల్ చల్

SMTV Desk 2017-12-05 12:50:59  amaravathi, sachchivalam, snake

అమరావతి, డిసెంబర్ 05 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సచివాలయంలో పాము కలకలం రేపింది. అమరావతి, సచివాలయం రెండో బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో సిబ్బందికి పాము కనిపించడంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురై కేకలు వేశారు. పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ఇది బయటకు వచ్చింది. అప్రమత్తమైన కార్మికులు దాన్ని వెంటనే చంపేసారు.