విడుదలకు ముందే రికార్డు లు సృష్టిస్తున్న ‘అజ్ఞాతవాసి’

SMTV Desk 2017-12-04 23:53:01  agnathavasi, movie, records, pawan kalyan, trivikram, director

హైదరాబాద్, డిసెంబర్ 04 : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరేకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ వ్యాపారంలో రికార్డు సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అమెరికాలో ఇంతవరకు ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్‌లలో 209 ప్రాంతాల్లో విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, హీరోయిన్లుగా నటిస్తుండగా, అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.