అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరి శిక్షే..!

SMTV Desk 2017-12-04 18:17:31  madhya pradesh government, new bill passed for harassment, CM Shivraj Singh Chauhan

మధ్య ప్రదేశ్, డిసెంబర్ 04 : అత్యాచారానికి పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం లభించింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి ఈ శిక్షను విధించనున్నారు. ఈ బిల్లుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పచ్చ జెండా ఊపారు. ఇక ఈ విషయంపై రాష్ట్రపతి ఆమోద౦ ఖరారైతే అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధి౦చనున్నారు. ఒకవేళ ఈ బిల్లు అందరి ఆమోదం పొందితే ఈ శిక్షను అమలు చేసే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరి౦చనుంది. అయితే ఈ బిల్లుపై కొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం మైనర్లను మాత్రమే ప్రస్తావించడం సరి కాదని, ఎవరిపైన అత్యాచారం జరిగినా ఇదే శిక్ష అమలు చేయాలని కోరుతున్నారు.